తెలంగాణ సెక్రెటరియేట్ లో వింత పోకడ.
తెలంగాణ సెక్రెటరియేట్ లో వింత పోకడ. విజిటర్స్ కు అనుమతి లేదని హుకుం. జిల్లాలు,నియోజవర్గాలవారీగా నిత్యం సచివాలయానికి జనం తాకిడి. మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,ఎమ్మెల్సీలవెంట అనుచరులకు అనుమతి నిరాకరణ. మంత్రుల సిఫార్స్ ను పట్టించుకోని సీఎస్ఓ కార్యాలయ సిబ్బంది. జీఏడీ నుండి మాకు ఆదేశాలు అంటు అవుతున్న వైనం. తెలంగాణ లో ప్రజా పాలనా సాగుతుంది. ముఖ్య మంత్రి నిర్ణయాలతో పాలనా పరమైన నిర్ణయాల్లో వేగం పుంజుకుంది. ఆరు గ్యారెంటీలను సక్సెస్ ఫుల్ అమలు చేస్తూ లోకల్ బడి ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న వేళ ప్రభుత్వ పరిధిలో పనిచేసే కొన్ని కీలక విభాగాల అత్యుత్సహం వల్ల సర్కార్ కు చెడ్డ పేరు వస్తుందన్న అపవాదు ఎదురు అవుతుంది. సచివాలయం ప్రభుత్వ పరిపాలన విభాగానికి గుండె కాయ లాంటిది.అలాంటి సెక్రెటరియేట్ లో ఇప్పుడు ఆంక్షల పర్వం నడుస్తోంది. మద్రాస్ నుండి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన డెబ్భై ఏళ్ళల్లో ఎప్పుడు లేని విదంగా కొత్తగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విడిపోయాక బాధలు చెప్పుకోవడానికి సెక్రెటరియేట్ వచ్చే వాళ్లకు అనుమతి లేదంటూ ఆపుతున్నారు కొంత మంది సిబ్బంది.ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి మొదలు ఆదిలాబాద్ వరకు ని...