హెచ్ఎండిఏ కమిషనర్ పై డిఓపిటికి పిర్యాదు.
హెచ్ఎండిఏ కమిషనర్ పై డిఓపిటి పిర్యాదు.
హెచ్ఎండిఏ పై ఫిర్యాదుల వెల్లువ
తీరు మారని కమిషనర్
కమిషనర్ వైఖరి తో సామాన్యుల ఇబ్బందులు.
హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో గందరగోళం నెలకొంది.ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే ఆ శాఖ తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది.ముఖ్య మంత్రి సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయాలనీ చెప్తున్న కమిషనర్ వినిపించుకోవడం లేదట.ఈ మధ్య కాలంలో స్వర్ణ భారతి జయంతి కాంప్లెక్స్ కు రావడం లేదట.నానక్ రాం గూడా లోని మున్సిపల్ కార్యాలయంలో పరిమితం అవుతున్నారని సమాచారం.కమిషనర్ తీరుపై డిపార్ట్మెంట్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.కమిటీ మీటింగ్ లో అప్రూవల్ అయిన ఫీజు లెటర్స్ కూడా మోక్షం రావడం లేదు.దింతో బాధితులు ముఖ్య మంత్రికి తమ గోడును చెప్పుకుందాం అనుకుంటున్నారని సమాచారం.హెచ్ఎండిఏ లో పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ల పై ఏసీబీకి పిర్యాదు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.వెంకట్ రెడ్డి అనే బాధితుడు అతని రెండెకరాలకు లే అవుట్ పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నాడు. ఇందుకోసం కమిటీ అప్రూవల్ చేసిన కమిషనర్ ఫీజు లెటర్ ఇవ్వడం లేదట.దింతో అయన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు పిర్యాదు చేసే యోచనలో ఉన్నారట. డెయిలీ ఇరవై నుండి ముప్పై మంది బాధితులు హెమ్ఎండిఏ కార్యలయానికి వస్తున్న అందుబాటులో ఉండటం లేదు. ఒకవైపు సీఎం ప్రజా పాలనా కోసం పరితపిస్తుంటే ఇంకో వైపు ఇలాంటి అధికారులు ఇలా చేయడం ఏంటి అంటున్నారు.
Comments
Post a Comment