PMGSY లో భారీగా అవకతవకలు.

PMGSYలో భారీగా అవకతవకలు పెండింగ్ నిధులు విడుదల కావడంతో పంచాయితీ రాజ్లో గందరగోళం కాంట్రాక్టర్లనుండి భారీగా కమిషన్లు వసులు కమిషన్ ఇస్తేనే బిల్లులు క్లియర్. ఆ శాఖ మంత్రి కనుసన్నులోనే అక్రమార్కుల అవినీతి బాగోతం ఏసిబి అధికారులు ద్రుష్టి పెట్టాలంటున్న కాంట్రాక్టర్లు PMGSYలో భారీగా అవకతవలు జరుగుతున్నాయట.ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమాల కింద రావాల్సిన పెండింగ్ నిధులను తాజగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సెంట్రల్ షేర్ కింద రావాల్సిన అరవై శాతం నిధులు డెబ్భై కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.దింతో స్టేట్ షేర్ కింద నలబై శాతం నిధులు( యాబై కోట్లు )విడుదల అయ్యాయి.దింతో ఏళ్ల తరబడి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లకు కాస్తంత ఉపశమనం దొరికినట్లు అయింది.అయితే ఇందులో భారీగా కమిషన్ల పర్వం నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క నేరుగా కమిషన్లు తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.మంత్రి పీఏ సతీష్ నేరుగా కాంట్రాక్టర్లకు అఫర్ ఇస్తున్నట్లు సమాచారం.పెండింగ్ బిల్లులు ఇక్కడ నుండి ఫైనల్ అయ్యి ఇంచార్జి ఈఎన్సీ అశోక్ వద్దకు చేరి అక్కడ నుండి బిల్లులు క్లియర్ అవుతున్నట్లు ఆరోపణలు వినిస్తున్నాయి.సీరియల్ వైస్ రావాల్సిన బిల్లులు ఇలా కమిషన్లకు కక్కుర్తి పడి అర్హత లేని వాళ్లకు ముందుగా డబ్బులు రిలీజ్ చేయడం వల్ల ఇతరులు పెద్దఎత్తున నష్టపోతున్నారన్న అపవాదు ఉంది.ఈ వ్యవహారంలో ఒక్క మంత్రికే దాదాపు రెండున్నర కోట్ల వరకు కమిషన్ వెళ్లినట్లు విమర్శలు ఉన్నాయి.ఒకవైపు ప్రభుత్వం ప్రజా పాలనా దిశగా అడుగులు వేస్తూ మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తుంటే ప్రభుత్వంలోని కొంతమంది అమాత్యులు ఇలా చేయడం పట్ల ప్రజల నుండి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) అనేది రహదారుల్లేని గ్రామాలకు అన్ని కాలాల్లోనూ అనుకూలంగా ఉండే రహదారిని నిర్మించే కేంద్ర ప్రభుత్వ పథకం.ఈ పథకంలో 500 కంటే ఎక్కువ జనాభా,కొండ ప్రాంతాలలో 250 కంటే ఎక్కువ జనాభా కలిగిన 1,78,000 ప్రాంతాలను అనుసంధానించడానికి ప్రణాళిక రెడీచేసారు.వీటిలో 82 శాతాన్ని 2017 డిసెంబరు నాటికి అనుసంధానం చేసారు. మిగిలిన 47,000 ప్రాంతాలను 2019 మార్చి నాటికి పూర్తి చేసే ప్రతిపాదన ఉంది.ఈ కార్యక్రమం ప్రారంభంలో 100% కేంద్ర ప్రాయోజిత పథకం, అంటే ఈ పథకానికి అయ్యే ఖర్చును మొత్తం కేంద్ర ప్రభుత్వం అందచేస్తుంది.2015-16 సంవత్సరం నుండి అయ్యే ఖర్చుకు నిధులు 60:40 నిష్పత్తిలో కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచుకోబడ్డాయి.ఈ కేంద్రీకృత ప్రాజెక్టును 2000 డిసెంబరు 25న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించాడు.ఈ ప్రాజెక్టును కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించి, అమలు చేస్తోంది.ఈ పథకానికి అవసరమయ్యే నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.2015 నవంబరులో, కేంద్ర ప్రాయోజిత పథకాల హేతుబద్ధీకరణపై 14వ ఆర్థిక సంఘం, ముఖ్యమంత్రుల ఉపసంఘం సిఫారసులను అనుసరించి,ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్రాలు 40% నిధులు సమకూరుస్తూ ఉంటాయి.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు