జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు

అధికారులు వర్సెస్ రాజకీయ నాయకులు 

రూలింగ్ పార్టిలో ఉన్న నేతలు చెప్పిన పట్టించుకొని అధికారులు 

ఎవరైతే నాకంటి నాకు సీఎం సోదరుల సపోర్ట్ ఉందంటూ బెదిరింపు 

లేటెస్ట్ గా  మహబూబా బాద్ ఎంపీ బలరాం నాయక్ చెప్పిన లైట్ తీసుకున్న జీహెచ్ ఎంసీ ఈఎన్సీ.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నంత స్వేచ్చ మారె ఏ సర్కార్ లో ఉందంటారు. ఇదే అదునుగా కొంతమంది అధికారులు సొంత పార్టీ నేతల మాటలను లెక్క చేయడం లేదట.స్వారాష్ట్రంలో ఇక్కడి ఉద్యోగులను కాదని ఉన్నత పదవులను కట్టబెడితే అదే అదునుగా తమకు ముఖ్య మంత్రి సోదరుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని మిగతా నేతలకు ధమ్కీ ఇస్తున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే జీ హెచ్ఎంసీ ఈఎన్సీ గా బాధ్యతలు నిర్వరిస్తున్నా ఉన్నతాధికారి వ్యవహార శైలిపై జోరుగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కమిషనర్ మాట లెక్క చేయకపోవడం అటుంచితే అధికార పార్టీ నేతలు ఏదైనా సొంత పనికోసం వెళితే నేను చేయను ఎం చేసుకుంటారో చేసుకోండి అంటూ సుర్రు బుర్రు అంటున్నారట. రీసెంట్ గా ఎంపీ బలరాం నాయక్ అయన నియోజకవర్గానికి చెందిన ఓ ఉద్యోగికి అన్యాయం జరిగింది అవకాశం ఉంటె కొంచెం న్యాయం చేయండని అడిగారట. అందుకు సదరు ఈఎన్సీ మీరు ఎవరైతే నాకేంటి నాకు ప్రభుత్వం లో పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉందంటూ సెటైర్లు వేసినట్టు తెలుస్తోంది. నలుగురు అధికారులకు రావాల్సిన పదవులను ఒక్కరే మెంటైన్ చేస్తూ మిగతా వారికీ అన్యాయం చేస్తున్నట్లు ఇలా ఇబ్బందులకు గురు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు జీహెచ్ ఎంసీ కమిషనర్ గా ఉన్న ఇలంబర్తి మాటను కనీసం లెక్క కూడా చేయలేదట. సదరు అధికారికి నేరుగా ముఖ్య మంత్రి కుటుంభ సభ్యుల మద్దతు ఉందని చెప్పుకోవడం తో పై అధికారులు చేసేది ఎం లేక ముక్కున వేలేసుకోవడం తో సరిపోతుంది అంటున్నారు బల్దియా కు వచ్చే జనాలు. ఎక్కడ ఎలాంటి సంబంధాలు లేని సీఎంను, అయన కుటుంభ సభ్యులను ఇలా వాడుకొని బద్నామ్ చేస్తున్న వారిని సీఎం గారే కట్టడి చేయాలంటున్నారు జనం.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ