హెచ్ఎండిఏ హార్టికల్చర్ లో భారీగా అవినీతి తిమింగలాలు
హెచ్ఎండిఏ హార్టికల్చర్ లో భారీగా అవినీతి తిమింగలాలు
13 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం
పట్టించుకోని హెచ్ఎండీఏ కమిషనర్
- గ్హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని హార్టికల్చర్ లో భారీగా అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొంతమంది అధికారులు అక్రమంగా అడ్డా దారిలో పోగేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హార్టీకల్చర్ మొక్కల టెండర్లు , వర్క్స్ విషయంలో కింది స్థాయి సిబ్బంది దాదాపు పదమూడు కోట్ల వరకు స్కామ్ చేసినట్లు సమాచారం. దీనిమీద కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ద్రుష్టి పెట్టడం లేదని అంటున్నారు. ముఖ్య మంత్రి నేరుగా ద్రుష్టి పెట్టకపోవడం వల్లనే ఇలా విచ్చల విడిగా ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది అంటున్నారు. దీని పరిధిలో పనిచేసే ఐఎఫ్ఎస్ అధికారి ప్రసాద్ కు ఉద్యోగులతో సమన్వయం లేకపోవడమే అసలు కారణం అంటున్నారు. ఇందులో తవ్విన కొద్దీ భారీ స్కామ్ బయట పడే అవకాశాలు ఉన్నాయట. అందుకోసం దీనిమీద ఎన్ఫోర్స్మెంట్ , విజిలెన్స్ , ఏసిబి లాంటి కీలక డిపార్ట్మెంట్లు ద్రుష్టి పెడితే ప్రజా ధనాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అంటున్నారు సామాన్య జనం.
Comments
Post a Comment