ప్రభుత్వంపై యుద్ధం తప్పదు బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు.

/s690/n-ramachander-rao-010133455-16x9_0.webp" style="display: block; padding: 1em 0; text-align: center; ">
పరిపాలన అంశాలపై ద్రుష్టి పెట్టండి. సామాన్యులకు ఇబ్బంది కలిగితే ఉరుకోము. ప్రభుత్వంపై యుద్ధం తప్పదు బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు. ఆర్టీఐ కింద సర్కార్ లో శాఖలవారీగా పనితీరు,పెండింగ్ అంశాలపై వివరాలు తీసుకుంటాం. ఎంఏయుడి,హెచ్ఎండిఏ,జీహెచ్ఎంసీలలో పనితీరు వల్ల ప్రజల ఇబ్బందులు. బీజేపీ నూతన అద్యక్షుడు రాం చందర్ రావు సర్కార్ పనితీరును ఎండగట్టేందుకు రెడీ అవుతున్నారు. రాజకీయ పరమైన విమర్శలకు చెక్ పెట్టి ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రజలకు చేసిన పనులపై బీజేపీ ధర్మ యుద్ధం చేసేలా సమాయత్తం చేయనున్నారు. పదకొండు ఏళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు,వాటి అమలు తీరుపై బీజేపీ శ్వేతా పత్రం విడుదల చేయనుంది. అలాగే ఆయా శాఖల పనితీరుపై రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెండింగ్ దరఖాస్తుల వివరాలు తీసుకోని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురానున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్,మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ దేవలప్మేంట్,హైద్రాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ల లో ఎన్ని ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయో వివరాలు తీసుకోని నేరుగా తీసుకోని నేరుగా ముఖ్య మంత్రికి నివేదిక ఇవ్వనున్నారు. ఐఏఎస్ ల పనితీరుపై రెగ్యులర్ సీఎం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న నేపత్యంలో ఈ మూడు శాఖల్లో దాదాపు మూడు వేల ఫైళ్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ మూడు శాఖల్లో జనం ఎదురుకొంటున్న ఇబ్బందులపై రాం చందర్ రావుకు భారీగా పిర్యాదులు వస్తున్నాయి.రాం చందర్ రావు స్వతహాగా సీనియర్ అడ్వాకెట్ కావడంతో ప్రజల వైపు నుండి సర్కార్ ను ఇరకాటంలో పెట్టెల వ్యూహాలు పదును పెడుతున్నారు.త్వరలో లోకల్ ఎన్నికల కోసం షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ప్రజలను సమాయత్తం చేయడంతో పాటు శాఖల వారీగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తున్నారు.సర్కార్ లో జరుగుతున్న వివిధ అవినీతి,అక్రమాలు,అధికారం అడ్డుపెట్టుకొని పలువురు ఐఏఎస్ ల మీద డీవోపీటీ కి పిర్యాదు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు