ఏసిబి ఆధికారులకు ఉద్యోగుల విజ్ఞప్తి
ఏసిబి అధికారులకు ఉద్యోగుల విజ్ఞప్తి
మమ్మల్ని కాదు వేల కోట్లు సంపాదిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ ల మీద ద్రుష్టి పెట్టండి.
కొంతమంది వల్ల మిగతా ఐఏఎస్ లు , ఐపీఎస్ లకు చెడ్డ పేరు వస్తుంది.
చిన్న ఉద్యోగులను టార్గెట్ చేయడం వల్ల ఎంప్లాయిస్ వర్గాల్లో ఆందోళన.
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ పేరు చెప్తే అవినీతి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మురళీధర్ రావు , హరిరాం నాయక్ , నూనె శ్రీధర్ లాంటి అవినీతి తిమింగలాలను పట్టుకున్న ఎసిబి అధికారులు అదే తరహాలో వేల కోట్లను సంపాదిస్తున్న పలువురు ఐఏఎస్ , ఐపీఎస్ అధికారుల మీద ద్రుష్టి పెడితే బాగుంటుంది అంటున్నారు. ముఖ్య మంత్రి చూసే శాఖలో భారీగా అవినీతి జరుగుతున్న ఎందుకు పట్టించు కోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మునిసిపల్ అడ్మినిస్టేషన్ అర్బన్ డెవలప్మెంట్, జీహెచ్ ఎంసీ,హెచ్ ఎం డీఏ లాంటి కీలక శాఖల్లో ఇంకా భారీ అవినీతి తిమింగలాలు బయట పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఈ మూడు ప్రధాన శాఖల్లో వందలాది ఫైళ్లు నెలల తరబడి పెండింగ్ లో ఉన్న ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంటుంది. ఏసీబీ అధికారులు అటువైపు ద్రుష్టి పెట్టడం లేదో చెప్పాలంటున్నారు.చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారిపై కాకుండా పెద్ద వ్యక్తులను కూడా స్కాన్ చేయడం వల్ల భారీగా ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా ఆపొచ్చు అంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విడిపోయాక 2014 తరువాత ఒక్కో ఐఏఎస్ , ఏపీఎస్ ల ఆస్తులు భారీగా పెరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.
Comments
Post a Comment