తెలంగాణలో పెరుగుతున్న అవినీతి తిమింగలాలు.
తెలంగాణలో పెరుగుతున్న అవినీతి తిమింగలాలు.
ఏసిబి పనితీరుపై ప్రజల సంతృప్తి.
ఒరిజినల్ వ్యక్తులను వదిలేసి అసలు వ్యక్తులను వదిలేస్తున్నారన్న విమర్శలు.
ప్రభుత్వం లోని పెద్ద తలకాలయాల మీద ద్రుష్టి పెడితే బాగుతుందంటున్న బాధితులు.
వేల కోట్లు సంపాదించే వారిని కాకుండా చిన్న ఉద్యోగులే టార్గెట్ గా మారుతున్న వైనం.
తెలంగాణలో అనిషా ( అవినీతి నిరోధక శాఖ) పనితీరు భేష్ అంటున్నారు జనం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటు కోట్లాది రూపాయల అక్రమాస్తులను కూడబెట్టుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.హరి రామ్ నాయక్,నూనె శ్రీధర్,మురళీధర్ రావు లాంటి వాళ్ళు సగటున ఒక్కొక్కరు వెయ్యి కోట్ల అక్రమాస్తులను కూడబెట్టినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.వారిని పక్క ప్రణాళికతో స్కెచ్ వేసి పట్టుకోవడంలో ఏసిబి సక్సెస్ అయింది.అలాగే రాష్ట్రంలో భారీగా అక్రమాస్తులను కుడా బెడుతున్న ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వ అనుమతితో దాడులు చేస్తే బాగుతుందంటున్నారు సామాన్య జనం.అలాగె ఏళ్ల తరబడి ఆయా శాఖల్లో పెండింగ్ లో ఉంటున్న వందలాది ఫైళ్లకు మోక్షం లభించడం లేదు.అందులో క్లియర్ గా అనుమతి ఉన్న వాటికీ కూడా పర్మిషన్ దొరకడం లేదు. బాధితులు సంవత్సరాల తిరిగిన న్యాయం జరగడం లేదు.మరి ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ,గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్,మునిసిపల్ అర్బన్ డెవలప్మెంట్ లాంటి కీలక శాఖలల్లో ఇబ్బందులు తప్పడం లేదు.సరిగ్గా రెండు నెలల కిందట ఏసిబి అధికారులు సెక్రెటరియేట్ లో మునిసిపల్ శాఖలో ఫైళ్ల పెండింగ్,అధికారుల పనితీరుపై ఆరా తీసి వివరాలు అడిగారు.ఆ ఎపిసోడ్ తో ఒక్కసారిగా సచివాలయంలో చాల డిపార్ట్మెంట్లలో కదలిక వచ్చింది. అలాగే మిగతా శాఖల్లో కూడా కదలిక వచ్చేలా చేయగలిగితే బాగుటుంది అంటున్నారు. అలాగే తాజాగా పంచాయితీ రాజ్ ఈఎన్సి కార్యాలయంపై దాడులు చేసి ఇంజనీర్ ఇన్ చిప్ కనకరత్నం ను అరెస్టు చేసారు. ఇందులో ఎలాంటి ఎంక్వేరి లేకుండా ఆఘమేఘాల మీద ఫ్రూఫ్ లేకుండా సదరు డిపార్ట్మెంట్ అధికారి పిర్యాదుతో రంగంలోకి దిగి అరెస్ట్ చేసారు.అయితే ఇదంతా ఈ ఎన్సి వ్యతిరేక వర్గం కుట్రతోనే జరిగిందనేది ఇంకో వర్గం చెప్తున్న వాదన.అయితే ఎసిబి అధికారులకు సమాచారం రాగానే వెళ్లి తనిఖీలు చేసారు.తనిఖీల్లో యాభై వేలు దొరకగానే డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎక్కడ దొరకలేదు కానీ పక్క స్కెచ్ తోనే ఇదంతా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇందులో ఎసిబి అధికారుల అత్యుత్సహం కూడా ఉందంటున్నారు.చిన్న చిరు ఉద్యోగులను కాకుండా పెద్ద పెద్ద స్కామ్ లు చేసే వారిపై కూడా ముఖ్య మంత్రి ద్రుష్టి సారిస్తే బాగుంటుంది అంటున్నారు జనం.
Comments
Post a Comment