పట్టించుకోని దేవాదాయ శాఖ డైరెక్టర్
పట్టించుకోని దేవాదాయ శాఖ డైరెక్టర్
గతంలో సూర్యపెట కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇదే తంతు.
మహబూబ్ నగర్ కలెక్టర్ గా ఉన్న సమయంలో కూడా
ప్రినిసిపాల్ శాఖ సెక్రెటరి చెప్పిననో రెస్పాన్స్
ఇటీవల కాలంలో పలువురు ఐఏఎస్ ల తీవ్ర స్థాయిలో వివాదం అవుతుంది. ప్రజల కోసం కాకుండా వారి వ్యక్తిగత ఎజెండా కోసం పని చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.రెగ్యులర్ ప్రాసెస్లో ఉన్న ఫైళ్లకు కూడా ప్రినిసిపాల్ సెక్రెటరి ఆదేశించిన పర్మిషన్ ఇవ్వకపోవడంతో బాధితులు రోడ్డున పడుతున్నారు.ఐదు వందల ఫైళ్లు పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. దేవాదాయ శాఖ లాంటి కీలక డిపార్ట్మెంట్ లో ఉన్న డైరెక్టర్ క్యాడర్ లాంటి వారిపైన మంత్రి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం.గతంలో మంత్రి సొంత నియోజకవర్గంలో నుండి కొంతమంది వచ్చిన కలిసిన డైరెక్టర్ రెస్పాన్స్ ఇవ్వలేదట.ఉన్నతాధికారి వైఖరి ఇలాగె ఉంటె సీఎస్ కు పిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చరట.నాలుగు జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన పద్దతి మారడం లేదని తెలుస్తోంది. సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ తో పాటు సూర్యాపేట లో ఉండగా ధరణి అడ్డుకొని చాలమందిని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.ప్రభుత్వ పరిధిలోని దేవదాయ భూములపై లీగల్ సమస్యలపై వివరణ ఇవ్వలని లా సెక్రెటరీ కార్యాలయం నుండి ఆదేశాలు వెళ్లిన సదరు అధికారి అందుబాటులో ఉండటం లేదట.ఇంకో నాలుగు నెలల్లో రిటైర్డ్మెంట్ ఉండటంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది.ఎండోమెంట్ లో పెండింగ్ ఫైళ్లపై త్వరలో బాధితులు ఏసీబీని కలిసి బాధను వేళ్ళబోసుకోపోతున్నారని వినికిడి.మంత్రి పీఎస్,ఓఎస్డీలు లు పబ్లిక్ సమస్యలపై అలెర్ట్ గా ఉండి బాధితులకు న్యాయం చేస్తున్న డైరెక్టర్ మాత్రం కనికరం చూపడం లేదు.
Comments
Post a Comment