ఆర్థిక శాఖను గాడిలో పెడుతున్న ఫైనాన్స్ సెక్రెటరీ.


 ఆర్థిక శాఖను గాడిలో పెడుతున్న సెక్రెటరీ

ఇంకా మంత్రి ఫ్రీ హ్యాండ్ ఇస్తే బాగుంటుంది అంటున్న మేధావులు

గతంలో ఐఏఎస్ లకె పవర్స్ 

టీఆరెస్ హయం నుండి గందర గోళంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 


ఆర్థికశాఖను ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా.మున్సిపల్ శాఖలో పెండింగ్ లో ఉన్న కన్వర్షన్ ఫైళ్లకు మోక్షం లభిస్తే ప్రభుత్వానికి దాదాపు ఆరు వందల కోట్ల ఆదాయం వస్తుంది. మైన్స్ శాఖలో ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల ఆదాయానికి టాక్స్ కట్టకుండా గండి కొడుతున్నారు. ఇలా ఒక్కో డిపార్ట్మెంట్ లో భారీగా పెండింగ్ ఫైళ్లుఉంటున్నాయి.ఇలా ఆయా డిపార్ట్మెంట్ల వారీగా సమీక్షలు , రివ్యూలు చేసి శాఖల వారీగా పెండింగ్ పడుతున్న వాటిపై ద్రుష్టి పెట్టి సర్కార్ కు ఆదాయం సమకూరే విదంగా రిఫామ్స్ తీసుకురావాలని సందీప్ కుమార్ ను కోరుతున్నారు విశ్లేషకులు.ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు అంశాల వారీగా అర్థిక శాఖ మీటింగ్స్ పెట్టేది. కేంద్ర ప్రభుత్వం నుండి రెగ్యులర్ గా రాష్ట్రానికి రావాల్సిన నిధులు , బకాయిలపై సమావేశాలు నిర్వహించేవారు.రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వీటీపై పూర్తిగా ద్రుష్టి పెట్టారు.  గతంలో గ్రామీణ సాధికారత కోసం సెర్ప్ ద్వారా భారీగా నిధులు ఇస్తూ మోటివేషన్ వేశారు. అదే మాదిరిగా స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక శాఖకు ఆదాయాన్ని పెంచే మార్గాలపై ద్రుష్టి పెట్టాలని అంటున్నారు. ఇందుకోసం ఆర్థిక మంత్రి సెక్రటరీకి అనుమతి ఇస్తే బాగుంటుంది అంటున్నారు.ఉమ్మడి స్టేట్ లో ఫైనాన్స్ సెక్రెటరీగా శీలా బేడీ , ప్రీతి సుడాన్ , పి.సంపత్ కుమార్ ఐఏఎస్ , పీవీ రమేష్ , భాస్కర్ ఐఏఎస్ లు ఆర్థిక శాఖను గాడిలో పెట్టి అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. అప్పుడు మంత్రి రివ్యూ చేసాక ఫైనాన్స్ సెక్రెటరీ రివ్యూస్ చేసే అవకాశం ఉండేది. ఆర్థిక ఆదాయ వనరుపలపై మంచిపట్టున్న సందీప్ కుమార్ లాంటి ఐఏఎస్ లకు ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇస్తే మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు మేధావులు.కరీంనగర్ కలెక్టర్ , వైజాగ్ జేసిగా , ట్రాన్స్ ఫోర్ట్ కమినగర్, జెన్కో ఎండి , పంచాయితీ రాజ్ సెక్రెటరీ గా అద్భుతమైన ప్రతిభను కనపరిచిన సందీప్ కుమార్ కు ఫైనాన్స్ శాఖ ప్రోత్సహిస్తే  ఇంకా బాగుటుంది అంటున్నారు.టోకెన్స్ రిలీజ్ చేసే అంశంలో కూడా మంత్రి అనుమతి లేనిదే ముందుకు కదలని పరిస్థితి నెలకొంది.దింతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు