బాబోయ్ మాకొద్దు ఈ మంత్రి

బాబోయ్ మాకొద్దు ఈ మంత్రి డిపార్ట్మెంట్లో ఉద్యోగుల అసహనం. ఏడాది కాలంలో భారీగా శాఖలో అవినీతి ప్రతిఫైల్ కు కమిషన్ వెళ్లాల్సిందే. ఏ గ్రాంట్ వచ్చిన అందులో 12 శాతం కమిషన్ తప్పని సరి తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖలో ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారట.మంత్రి సీతక్క వ్యవహార శైలీ తో బాబోయ్ మాకొద్దు ఈ మంత్రి అంటూ బహటంగానే చెప్పుకుంటున్నట్లు వినికిడి. సంబంధిత శాఖలో ఒక్కో ఫైల్ నెలల తరబడి పెండింగ్ లో పెడుతున్నట్లు సమాచారం. డిపార్మెంట్ కు ఏదైన ఫైల్ వెళ్లిందంటే కనీసం రెండు నుండి మూడు నెలల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.ఓ షాడో అధికారి డిపార్ట్మెంట్ లో చక్రం తిప్పుతున్నారట. సింగరేణి నుండి డిప్యూటేషన్ మీద మంత్రికి పీఏ గా వచ్చిన వ్యక్తి పంచాయితీ రాజ్ మొత్తం ఏక చక్రాదిపత్యం తో ఏలుతున్నట్లు ఉద్యోగులు కోడైకూస్తున్నారు. మంత్రికంటే అన్ని తానై వ్యవహరిస్తున్నట్లు సమాచారం.సింగరేణి నుండి తనను స్పెషల్ గా డిప్టేషన్ మీద తీసుకున్నారని తన మాటే శాసనమని చెప్పుకొని ఉద్యోగులను బెదిరిస్తునట్లు తెలుస్తోంది. ఇక పీ ఆర్ ప్రినిసిపాల్ సెక్రెటరీ ఎవరికీ అందుబాటులో ఉండరట. దాదాపు పదేళ్లు సింగరేణి సిఎండి గా చక్రం తిప్పి పిఆర్ డిపార్ట్మెంట్ కు వచ్చిన అధికారి రూటే సపరేట్ అన్నట్లు గా ఉన్నారట. అయన బాధ్యతలు తీసుకున్న ఏ ఒక్కరోజు శాఖ పనితీరుపై సమావేశం జరపలేదు. ఇప్పటికే ప్రభుత్వం లోకల్ బడి ఎన్నికలకు సిద్ధం అవుతుంది.ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మంత్రి మాములు జనాన్ని అస్సలు కలవడం లేదు. ఇటీవల కాలంలో పీఎంజిఎస్వై నిధుల్లో మంత్రికి భారీగా కమిషన్లు వెళ్లినట్లు మంత్రి పిఎనే బయట చెప్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక పంచాయితీ రాజ్ ఇంచార్జి ఈఎన్సీ తంతే వేరు అన్నట్లు గా ఉంది. ఎవరికీ ఆన్సరబుల్ గా ఉండరన్న పేరుంది. పేరుకే నిజాయితీ లోపల అంత డొల్ల అంటున్నారు ఇంజనీర్లు. ఇటీవల కాలంలో ఏసిబి కి ఫుల్ పవర్స్ ఇచ్చిన ముఖ్య మంత్రి పిఆర్ మీద పూర్తీ స్థాయి ద్రుష్టి పెడితే బాగుంటుంది అంటున్నారు.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు