పంచాయితీ రాజ్ శాఖలో షాడో మంత్రి.
పంచాయితీ రాజ్ శాఖలో రోజుకో అంశం వివాదాస్పదమౌతోంది.మంత్రి దగ్గర పనిచేసే సిబ్బంది వ్యవహర శైలితో శాఖ ప్రతిష్టదిగజారుతోంది.తద్వారా మంత్రికి చెడ్డ పేరు వస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.మంత్రి దగ్గర పనిచేసే పిఎపై మంత్రి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది.మంత్రి సీతక్క ను రాంగ్ గైడ్ చేస్తు పంచాయితీ రాజ్ శాఖను గందరగోళం లో పడేస్తున్నారు.సింగరేణి నుండి డిప్యూటేషన్ మీద వచ్చి షాడో మంత్రిగా చలామణి అవుతున్నారని శాఖాపరమైన ఉద్యోగులు చెప్తున్నారు.మహిళ ఉద్యోగినులను టార్గెట్ చేస్తు ఇష్టారీతిగా ట్రాన్ఫర్స్ను చేస్తున్న పట్టించుకొనే వారు లేరని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాగాజా సెక్రెటరియేట్ లో పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగిని ఆకారణంగా అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయించారని ఇది ఏంటని అడిగితె నేను మంత్రి పిఎను అన్ని తన కనుసన్నుల లోనే నడుస్తాయని దబాయించినట్లు సమాచారం.ఇసుక , ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ ఫేర్ , పంచాయితీ రాజ్ , పీఎంజిఎస్ వై డిపార్ట్మెంట్ లలో భారీగా కమిషన్లు మంత్రి పేరు చెప్పి వాసులు చేస్తున్నారట. గతంలో సింగరేణి లో తనకంటు ఓ బలమైన వర్గం ఉండేది ఇప్పుడు మంత్రి సీతక్క దగ్గర అంతే ఉంటుందని చెప్పుకుంటున్నారని వినికిడి.దింతో మంత్రికి చెడ్డ పేరు తెస్తున్నరన్న పేరుంది.డిపార్ట్మెంట్ లోని ప్రతి ఫైల్ లో కమిషన్ ఉండాల్సిందే అంటున్నారు. పంచాయితీ రాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ తో కలిసి ఆ శాఖలోని ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నారని ఎర్ర మంజిల్ లో చర్చ జరుగుతోంది. పిఎంజిఎస్ వై నిధుల్లో భారీగా మంత్రికి కమిషన్లు ముట్టాయని మంత్రి పిఎ తన సన్నిహితుల వద్ద చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా మంత్రి చొరవతోనే జరుగుతున్నట్లు ప్రచారం సాగుతున్న ఇందులో ఎంతవరకు మంత్రి దృష్టిలో ఉందనే చర్చ కూడా ఉంది. ఇలాంటి వ్యక్తిగత పిఎ వల్ల మంత్రికి శాఖకు చెడ్డ వస్తుంది.ప్రజల కోసం పని చేయాల్సిన ప్రజా ప్రతినిధుల వ్యక్తిగత సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరించడం సరికాదు అంటున్నారు.పంచాయితీ రాజ్ శాఖ ఈఎన్సీ తో కలిసి మంత్రి పిఎ భారీగా వసూళ్లు చేస్తూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారట. దీనిపై త్వరలో సీఎం ను కలిసి పిర్యాదు చేస్తానంటున్నారు బాధితులు.
Comments
Post a Comment