రాజ గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్
మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మంత్రి పదవి విషయంలో తీవ్ర అసంతృప్తి మీదున్న రాజ గోపాల్ రెడ్డికి త్వరలో బెర్త్ కన్ఫమ్ కానున్నట్లు వినికిడి.రెండు సార్లు ఎంపి , ఒకసారి ఎమ్మెల్సీ , రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా రాజ గోపాల్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతగా గుర్తింపు పొందారు.మధ్యలో కమలం గూటికి వెళ్లి భంగపాటు అయన బీజేపీ నుండి మల్లి కాంగ్రెస్ లోకి వచ్చారు.రాజ గోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి , పలువురు కాంగ్రెస్ ఇంచార్జిలు హామీ ఇవ్వడం హస్తం గూటికి చేరి స్వపక్షం లో విపక్షం లాగా మారారు.రేవంత్ మాట పై నమ్మకం లేదంటు వరుసగా అయన అసంతృప్తిని బయట పెడుతున్నారు.కాంగ్రెస్ పవర్ లోకి రావడం కోసం తనవంతు కృషి చేసిన రాజ గోపాల్ కు మొండి చేయి చూపించి అయన సోదరుడు వెంకట్ రెడ్డికి కేబినెట్ లో అవకాశం ఇచ్చారు.ఎంపీ ఎన్నికల్లో భువనగిరి సిటు విజయం కోసం పని చేసిన గుర్తింపు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉండటం మునుగోడు ప్రజలకు నచ్చడం లేదట.కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ సిటు విజయం కోసం రాజ గోపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేసారు.ఇక నిదుల విషయానికి వస్తే కొడంగల్ మాదిరిగా మునుగోడుకు నిధులు కావాలన్నా డిమాండ్ వస్తుంది.తనకు మంత్రి పదవి రాకుండా రేవంత్ అడ్డుకుంటున్నారని పదే పదే ఆరోపణలు చేస్తున్న కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డికి హస్తిన పెద్దలు హామీ ఇచ్చినట్లు సమాచారం.ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి రిపోర్టర్ల మీద చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాజ గోపాల్ రెడ్డి ముందు రేవంత్ రెడ్డి అయన పాలనా మీద ద్రుష్టి పెట్టి అడ్మినిస్ట్రేషన్ సరిగా నడిపిస్తే చాలంటూ చురకలు వేశారు.అసలు షోషల్ మీడియా లేకుండా రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి ఎలా అయ్యాడో చెప్పాలి అంటు సెటైర్లు వేశారు . ఇలాగె అహంకారిత మాటలు మాట్లాడితే ఎపిలో జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే పడుతుంది అంటు ఎద్దేవా చేయడం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Comments
Post a Comment