ఆర్ అండ్ బి మినిస్టర్ పనితీరు భేష్
ఆర్ అండ్ బి మినిస్టర్ పనితీరు భేష్
ఏడాదిలో శాఖను పరుగులు పెట్టిస్తున్న వైనం
మంత్రి చొరవతో మంచి ఫలితాలు
డిపార్ట్మెంట్ పరిధిలో మంత్రి పేషీలో భారీగా పెండింగ్ ఫైళ్లు.
మంత్రి దృష్టికి తీసుకెళ్లని సదరు పేషీ అధికారులు
ఆర్ అండ్ బి శాఖను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారు.ఏడాది కాలంలో ఆయన తీసుకున్నా నిర్ణయాలతో శాఖ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది.డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఇబ్బంది ఉన్న నేరుగా సీఎంకు చెప్పి సాల్వు చేయగల మంత్రిగా కోమటి రెడ్డికి వెంకట్ రెడ్డికి పేరుంది.అదే బాటలో ఆర్ అండ్ బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ కు సైతం పేరుంది.వికాస్ రాజ్ కూడా డిపార్ట్మెంట్ లోని ఏ ఒక్క ఫైల్ పెండింగ్ లేకుండా క్లియర్ చేస్తున్నారు.ఆర్ అండ్ బి శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి మంత్రి నిర్ణయాలకు అనుగుణంగా దూసుకెళ్తున్నారు.కానీ మంత్రి కోమటి రెడ్డి పేషీ లో కొన్ని కీలక ఫైళ్లు పెండింగ్ ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.ఇది మంత్రి నోటిస్ లేనట్లు సమాచారం.తద్వారా మంత్రి పేరు బద్నామ్ అవుతున్నట్లు తెలుస్తుంది.ఇటీవల AEEs నుండి DEEs గా ప్రమోషన్లు పొందాల్సిన పదిహేను మందికి సంబందించిన ఫైల్ ( 284 ఫైల్ నంబర్ ) ప్రమోషన్ లిస్టు లో భాగంగా మంత్రి వద్దకు చేరింది.ఈ ఫైల్ వెళ్లి నెల కావస్తున్న మంత్రికి చెప్పకుండా పేషీలో సిబ్బంది ఆపినట్లు తెలుస్తోంది.దీనివల్ల రెగ్యులర్ గా ప్రమోషన్లు పొందాల్సిన చిన్న ఉద్యోగులు నష్టపోతున్నారు.ఒకవైపు మంత్రి పెండింగ్ లేకుండా ఫైళ్లన్నీ క్లియర్ చేస్తూ పోతుంటే పేషీ లోని సిబ్బంది ఇలా కొన్ని ఫైళ్లను మంత్రి నోటిస్ కు వెళ్లకుండా ఆపడం అనుమానాలను తావిస్తుంది.ఒకవేళ మంత్రి దృష్టికి వెళ్ళివుంటే ఇప్పటికే అర్హులైన ఉద్యోగులకు న్యాయం చేసేవారు. ఇప్పటికైనా మంత్రి ద్రుష్టి పెడితే బాగుంటుంది అంటున్నారు ఆర్ అండ్ బి ఉద్యోగులు.
Comments
Post a Comment