సచివాలయ అనుమతిపై మాకు సీఎం ఆదేశాలు

సచివాలయ అనుమతిపై మాకు సీఎం ఆదేశాలు అందుకోసమే ఎవరిని అనుమానించడం లేదు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , మంత్రుల పేరిట ఎవరు రావొద్దు మీడియా కు సైతం ఆంక్షలు తప్పవు సెక్రెటేరియేట్ సెక్యురిటి విభాగం ఉన్నతాధికారి తెలంగాణ సచివాలయంలో ఆంక్షల పర్వం నడుస్తోంది.ఆయా పనుల నిమిత్తం లోపలికి వెళ్లేవారికి అనుమతి లేదంటూ పోలీసులు నిలిపివేస్తున్నారు. వివిధ సమస్యలపై సంబంధిత శాఖ అధికారులను కలిసేందుకు వస్తున్నా వారిని స్పెసిఫిక్ గా లోపలికి అనుమతి ఇస్తున్నారట.ఈ మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి సచివాలయం వచ్చిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ఇదే తరహా ఆంక్షలు ఉండేవి. ప్రజా పాలనలో కూడా అదే రిపీట్ అవుతుంది. దింతో సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్య మంత్రి కాకముందు సెక్రెటరియేట్ లో ఆంక్షలపై ఒంటికాలిపై లేసిన సీఎం ఇప్పుదు అక్కడే ఆంక్షలు పెట్టడం సరికాదు అంటున్నారు.ఒకప్పుడు మంత్రి సీతక్క ఎమ్మెల్యే హోదాలో సచివాలయానికి రిప్రెసెంటేషన్ ఇవ్వడానికి వస్తే అనుమతి నిరాకరించారని అప్పట్లో టీఆరెస్ ను బద్నామ్ చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలొకి వచ్చాక అదే వైఖరి కొనసాగుతుంది. ముఖ్య మంత్రి అనుమతితోనే సచివాయా ఎంట్రీఫై ఆంక్షలు ఉంటున్నాయని సీఎస్ఓ వర్గాలు చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిరంతరం ప్రజా క్షేమం కోసం ఆలోచించే సిఎంను కొంతమంది అధికారులు ఉదేశ్య పూర్వకంగా ఆపుతున్నారట ఆరోపణలు ఉన్నాయి. గడిచిన సారి సీఎం సెక్రెటరియేట్ లో ఉన్నారంటూ విజిటర్స్ ను అలో చేయలేదు. దింతో ఆయా పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు.అయితే ఇది సీఎంఓ నుండి ఆదేశాలు వచ్చాయా లేక బందోబస్తు పర్యవేక్షిస్తున్న పోలీసులు సొంతం గా తీసుకున్న నిర్ణయమా అంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు