ఆర్ అండ్ బిలో ఓఎస్డీ అక్రమాలు..!
ఆర్ అండ్ బిలో ఓఎస్డీ అక్రమాలు..!
మంత్రికి తెలియకుండా పదోన్నతుల విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు.
డిఈఈ నుండి ఈఈలుగా ప్రమోషన్లు పొందేవారి నుండి వసూల్
రిటైర్డ్ అయిన వ్యక్తికీ ఓఎస్డీ గా బాధ్యతలు
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాల్సిన కొంతమంది వ్యక్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు.శాఖపరంగా మెరుగైన ఫలితాల సాధించాలంటే ఉద్యోగులదే కీలక పాత్ర.అలాంటిది అధికారాన్ని అడ్డుపెట్టుకొని మంత్రి మంచితనాన్ని ఆసరాగా చేసుకోని దాదాపు ముప్పై మంది ఎంప్లాయీస్ ను పదోన్నతులు రాకుండా అడ్డుకుంటున్నారట మంత్రి వద్ద ఓఎస్డీ గా పనిచేస్తున్న సదరు అధికారి.ఒక్కో ఈఈ నుండి ముప్పై లక్షల వరకు డిమాండ్ చేస్తుండటంతో వారంతా ఎం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న కేబినెట్ మంత్రులందరిలో ఆర్ అండ్ బి శాఖ మంత్రికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తో మంచి సంబంధాలు ఉన్నాయి. తన శాఖకు అవసరమైన ఏ అంశాన్ని అయిన సూటిగా సీఎంకు చెప్పగలిగేంత చనువు ఉంటుంది.మిగతా మంత్రులతో పోలిస్తే ఆర్ అండ్ బిలోనే అత్యధికంగా రెగ్యులర్ సమీక్షలు , డిపార్ట్మెంట్ సమస్యల మీద చర్చలు జరుపుతుంటారు మంత్రి. ఇంతా మంచిపేరున్న మంత్రి దగ్గర ఓఎస్డీ గా పనిచేసే అవకాశం వస్తే అటు ప్రభుత్వనికి ఇటు శాఖకు మంచి పేరు తీసుకురావాలి. అంతేకాని ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదు అంటున్నారు సచివాలయ వర్గాల ఎంప్లాయిస్. గతంలో ఆర్ అండ్ బి శాఖ లో సెక్రెటరీ గా పనిచేసిన ఓ అధికారిణిని అడ్డుపెట్టుకొని రోడ్డు కార్పొరేషన్ లో ఫైళ్లను చక్కబెట్టేవారట.సొంత అవసరాల కోసం డిపార్ట్మెంట్ వాహనాలను వాడుకొని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్న ప్రచారం ఉంది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రావాల్సిన తమ పదోన్నతులను ఇలా అడ్డుకొని ఇబ్బందులకు గురి చేస్తున్న ఓఎస్డీ పై మంత్రి గారు చర్యలు తీసుకోవాలని డీఈఈ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Post a Comment