ప్రభుత్వ శాఖల్లో పబ్లిక్ రిలేటెడ్ వాటిపై ద్రుష్టి పెట్టండి.
ప్రభుత్వ కీలక శాఖల్లో పబ్లిక్ రిలేటెడ్ వాటిపై ద్రుష్టి పెట్టండి.
గతంలో సమస్య మీద లేఖ రాస్తే వెంటనే స్పందించే వారు.
అదే తరహాలో మాకు న్యాయం చేయండి అంటున్న సామాన్య జనం
ఒకవైపు ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుంటే ఇంకోవైపు కొందరు అధికారుల పనితీరు సర్కార్ ను ఇరకాటంలో పెట్టెలా చేస్తుంది. ప్రభుత్వం ఎంత పారదర్శకత ప్రదర్శించాలని చుసిన ఉన్నతాధికారుల అతి కారణంగా సామాన్యులు నష్టపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం లో కీలకంగా పనిచేసే శాఖల పనితీరు అద్వాన్నంగా మారుతుందన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.అందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ &అర్బన్ డెవలప్మెంట్ లాంటి శాఖలో ఉన్నతధికారుల తీరు చాల ఇబ్బంది కరంగా ఉందట.ప్రభుత్వ రంగ పరిధిలో పనిచేసే కొన్ని సంస్థలు అదే ప్రభుత్వంలో ఉండే కొన్ని శాఖలపై ద్రుష్టి పెడితే జనానికి మంచి జరిగే అవకాశం ఉందంటున్నారు మేధావులు. అవినీతి పరులు,లంచగొండిల ద్రుష్టి సారిస్తే రెగ్యులర్ గా క్లియర్ అయ్యే చాల ఫైల్స్ ఆగకుండా తమకు న్యాయం జరుగుతుంది అంటున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఎసిబి పనితీరు భేష్. చాలామంది సామాన్యులకు న్యాయం జరిగేలా చూసి అవినీతి అక్రమాలు చేసే వారి వెన్నులో వణుకు పుట్టిస్తుంది తెలంగాణ ఏసిబి శాఖ.అదే తరహాలో కొన్ని శాఖలపై ప్రత్యేక నిఘా పెడితే మరింత బాగుటుంది అంటున్నారు.గత ఉమ్మడి రాష్ట్రంలో ఎసిబి జాయింట్ డైరెక్టర్ గా కొత్త కోట శ్రీనివాస్ ,డిజిగా భూపతి బాబులు ఏ పౌరుడు లేఖ రాసిన లేదా పేపర్లో ప్రచురితం అయినా వెంటనే డిప్యూటీ సెక్రెటరి స్థాయి అధికారిని పిలిచి వివరణ అడిగేవారట.ప్రస్తుతం కూడా అదే తరహాలో పనిచేస్తే బాగుటుందంటున్నారు సామాన్య జనం.
పబ్లిక్ రిలేటెడ్ శాఖలపై ఏసీబీ ద్రుష్టి పెడితే అద్భుతమైన పలితాలతో పాటు ప్రజలకు త్వరితగతిన న్యాయం జరిగేలా అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Post a Comment