గందరగోళంలో ఆర్థిక శాఖ...!
గందరగోళంలో ఆర్థిక శాఖ.
మంత్రి తీరుతో అయోమయంలో ఫైనాన్స్ ఎంప్లాయిస్, జనం.
ఆర్థిక శాఖలో కమిషన్ల పర్వం.
సొంత అంశాలపైనే మంత్రి ద్రుష్టి.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ గాడి తప్పింది.అన్ని డిపార్ట్మెంట్ లను సమానంగా చూడాల్సిన ఆర్థిక శాఖ మంత్రి అన్నింటి కంటే ఎక్కువ అయన సొంత పనుల మీద ద్రుష్టి పెట్టినట్లు తెలంగాణ సమాజం కోడై కూస్తుంది. ప్రభుత్వ , ప్రైవేట్ పరిధిలోని ఏ విభాగాల్లో పెండింగ్ బిల్లులు క్లియర్ కావాలంటే కమిషన్లు ఉండాల్సిందేనంట.చివరాఖరకు పార్టీతో ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న వారి దగ్గర నుండి కమిషన్లు ఆశిస్తున్నారట. ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియాకు అవగాహనా ఉన్న ఆయన మౌనానికి పరిమితం అయ్యారు. మంత్రి అనుమతి లేకుండా కనీసం రెండు కోట్లు విడుదల చేయలేని పరిస్థితి లో ఉన్నారు.పంచాయితీ రాజ్ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర కిందట (పిఎంజెసి ) డెబ్భై ఐదు కోట్లు విడుదల చేసింది.రాష్ట్ర ప్రభుత్వం తన షేర్ కింద ఇవ్వాల్సిన యాబై ఐదు కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక శాఖ మంత్రికి మనసు రావడం లేదట. నిత్యం కమిషన్ల కోసం తప్పితే ప్రజల కోసం పని చేయని వ్యక్తికీ ఆర్థిక శాఖ అప్పగించారని సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారి జిల్లాల ఇంచార్జి మంత్రుల వద్ద విన్నవించుకున్న ఫలితం లేదట.ముఖ్యంగా రంగారెడ్డి , సంగారెడ్డి , మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు నిత్యం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న ఆర్థిక శాఖ మంత్రి మనసు మాత్రం కరగడం లేదంటున్నారు.అయన సొంత నియోజకవర్గం మధిరకు పంచాయితీ రాజ్ ఇతర విభాగాలకు అరవై కోట్లు , ఆర్ అండ్ బి కోసం డెబ్భై కోట్లు రిలీజ్ చేసారట.ఇతర ఎమ్మెల్యేలు అదే స్థాయిలో తమ నియోజకవర్గాలకు నిధులు కావాలని అడుగుతున్న ఆర్థిక శాఖ మంత్రి నుండి సమాధానం లేదంటున్నారు.సీఎం ఆర్థిక శాఖ , పంచాయితీ రాజ్ శాఖల మీద ద్రుష్టి పెడితే బాగుటుందిఅంటున్నారు.ఇటు మంత్రి సీతక్క సైతం ఆమెకు సొంత పనుల మీద ఉన్న ద్యాస శాఖ మీద లేదంటున్నారు జనం.మంత్రి సెక్రెటరీ శ్రీధర్ ఛార్జి తీసుకున్నప్పటి నుండి ఒక్క రివ్యూ చేయలేదు.ఆఫీస్ లో అందుబాటులో ఉండరు.అసలు ఆ శాఖలో వ్యవహారాలు చక్కబెట్టడం ఆయనకు ఇష్టం లేదట. పంచాయితీ రాజ్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళా ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే సమాధానం ఇవ్వలేక దాట వేస్తున్నట్లు సమాచారం. ఏమైనా పెండింగ్ సమస్యలు ఉంటె ఆర్థిక శాఖ మంత్రిని అడగండి అంటూ ఎమ్మెల్యేలకు సలహాలు ఇస్తున్నారని తెలుస్తుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న సర్కార్ ముందు ఆర్థిక శాఖను , పంచాయితీ రాజ్ శాఖను గాడిలో పెడితే బాగుటుంది అంటున్నారు.
Comments
Post a Comment