తెలంగాణ ట్రాన్స్ ఫోర్ట్ లో అవినీతి అక్రమాలు.


 తెలంగాణ ట్రాన్స్ ఫోర్ట్ లో భారీగా అవినీతి తిమింగలాలు 

ఉమ్మడి రంగారెడ్డి , హైదరాబాద్ లో భారీగా అవినీతి 

నెలవారీ ఖాతాలో జేటీసీలకు కోట్లలో ఆదాయం 

ప్రభుత్వ పారదర్శకత ఆయా విభాగాల్లో  జరుగుతున్న పనితీరుపై అదరపడుతుతుంది. ముఖ్యంగా సర్కార్ ప్రజలకు అనువైన అంశాలను చక్కదిద్దిపెడితే ప్రజలకు మంచి జరుగుతుంది.అంతేకాని అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తే లేనిపోని ఇబ్బందులు వచ్చిపడతాయి. ప్రస్తుతం తెలంగాణ ట్రాన్స్ ఫోర్ట్ డిపార్ట్మేమెంట్ లో అదే జరుగుతుంది అంటున్నారు. తాజాగా ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయం లో ఏసిబి అధికారుల సోదాతో రాష్ట్ర వ్యాప్తంగా శాఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో జాయింట్ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్లకు కాసుల పంట పండుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.శాఖలో పైనుండి ఉన్నతాధికారులకు పూర్తీ సహకారం ఉన్నందువల్లే తమకు ఫ్రీ హ్యాండ్ ఉన్నట్లు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఉన్న ఓ ఉన్నతాధికారి చెప్పడం శోచనీయం. మొదటి నుండి తనకు మంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఉన్నతాధికారుల సమన్వయం తో శాఖను చక్కబెట్టేవారు భారీగానే లాభపడుతున్నారట.దింతో కొంతమంది అధికారులకు కలిసి వస్తుందన్న ఆరోణలు ఉన్నాయి. ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయం తరహాలోనే మిగతా చోట్ల ఏసిబి సోదాలు చేయాలనీ పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు.ఒక్కో చెక్ పోస్టు దగ్గర పోస్టింగ్ కోసం ఇరవై నుండి ముప్పై లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు