ఆ సెక్రెటరి తీరుతో ఎస్ఓలు, ఏఎస్ఓల ఇబ్బందులు.


మారని ఎంఎయుడి సెక్రెటరీ తీరు 

ఎన్నిసార్లు విన్నవించుకున్నా మారని వైఖరి 

ఎస్ఓ , ఎస్ఓల ఇబ్బందులు 

కిందిస్థాయి స్థాయి నుండి సెక్షన్ ఆఫీసర్ల మీద  పెరుగుతున్న ఒత్తిడి 

తెలంగాణ మునిసిపల్ శాఖ పనితీరు అద్వాన్నంగా మారుతుందన్న  విమర్శలు రోజు రోజు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్య మంత్రి వద్దే శాఖ ఉందన్న బాధ్యత లేకుండా ఫైళ్లు నెలల తరబడి పెండింగ్ లో ఉంచడం పై సచివాలయ వర్గాల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.ఎస్ఓలు, ఎఎస్ఒల మీద ఒత్తిడి పెరుగుతుండటంతో ఆ అధికారి వద్ద పని చేయలేమంటూ అసంతృప్తిగా ఉన్నారట. రెగ్యులర్ ప్రాసెస్ కాగాల్సిన ఫైళ్లను సైతం చూడకుండా ఆపడంపై నేరుగా సీఎంను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామంటున్నారు బాధితులు. జనరల్ అడ్మినిస్టేషన్ 250 ఫైళ్లు మిగతావి మరో రెండు వందల ఫైళ్లు మొత్తంగా ఐదు వందల ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయట.సాయంత్రం వేళా విజిటర్స్ సమయంలో వినతి పత్రాలు ఇచ్చి వెళదామని వస్తున్నా సందర్శకులకు దొరకకపోవడంతో తమ నియోజకవర్గల మంత్రులకు , ఎమ్మెల్యేలకు సమస్య చెప్పి కనీసం సీఎం తో నైనా చెప్పించి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నట్లు సమాచారం. దింతో అక్కడ పనిచేసే సిబ్బంది ఆ అధికారి మాకొద్దు బాబాయ్ అంటున్నారట.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు