ఎంఏయుడి పై ద్రుష్టి పెట్టండి


 ఎంఎయుడి , హెచ్ఎండీఏ పై ద్రుష్టి పెట్టండి.

ఏసీబీ ఉన్నతాధికారులను కోరనున్న బాధితులు.

నెలల తరబడి తిరిగిన న్యాయం జరగడం లేదంటు ఆవేదన.

ముసినిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ , హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లో వందల కొద్దీ ఫైళ్లు పెండింగ్.

ప్రభుత్వానికి అత్యంత ఎక్కువగా ఆదాయం సమకూరే వివిధ శాఖల్లో నెలకొన్న ఇబ్బందులు, సమస్యలను సుమటోగా తీసుకోవాలని ఏసీబీ ఉన్నతాధికారులను కోరనున్నారు బాధితులు.ఏళ్ల తరబడి తిరిగిన తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత బిఆర్ఎస్ పాలనలో మున్సిపల్, హెచ్ఎండీఎ డిపార్ట్మెంట్ ల చాల అస్తవ్యస్తంగా మారింది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు రూల్ ప్రకారం న్యాయం జరుగుతుందని ఆశించిన జరగడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెక్రెటరియేట్ మున్సిపల్ శాఖలో దాదాపు వెయ్యి పైగా ఫైళ్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో దాన కిశోర్ మున్సిపల్ శాఖ ప్రినిసిపాల్ సెక్రెటరీగా ఉన్నప్పుడు సాధ్యమైనన్నీ ఫైళ్లు పెండింగ్ లో లేకుండా క్లియర్ చేసారు. కానీ కొత్త బాస్ గా ఇలంబర్తి బాధ్యతలు తీసుకున్న తరువాత  సీన్ మొత్తం రివర్స్ అయిందట.దింతో రెగ్యులర్ గా లే అవుట్లకు ఇచ్చే అనుమతులపై వెనక్కి తగ్గడంతో చేసేది ఎం లేక బాధితులు కింది స్థాయి సిబ్బందిని అప్రోచ్ అవుతున్నారు.దింతో వాళ్ళు తగినంత డిమాండ్ చేయడంతో ఇవ్వక తప్పడం లేదట.అయిన కూడా ప్రినిసిపాల్ సెక్రెటరిలోస్థాయిలో క్లియర్ కావాల్సిన ఫైళ్లను కూడా నెలల తరబడి ఆపుతున్నారు. దింతో ఏసీబీ అధికారులు ఇటువైపు ద్రుష్టి పెడితే తమకు న్యాయం జరిగే అవకాశం ఉందంటున్నారు.ఇక మరో కీలక శాఖ హెచ్ఎండీఏ ఇందులో కూడా దాదాపు వెయ్యి ఫైళ్లు క్లియర్ కు నోచుకోవడం లేదట. బాధితులు ఎవరైనా వెళ్లి కమిషనర్ ను అడిగితె పై నుండి ఆదేశాలు రావాలని చెప్పడంతో వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. కనీసం ఎకరం , రెండు ఎకరాలు , మూడెకరాలకు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. గతంలో టీఆరెస్ లో ఇదే పరిస్థితి ఉన్న ఇప్పుడు అదే కొనసాగుతుంది.వందలాది మంది ప్రజలతో ముడిపడి ఉన్న ఈ రెండు అతి ముఖ్యమైన శాఖల పనితీరు పై ఏసీబీ అధికారులు ద్రుష్టి పెడితే బాగుటుంది అంటున్నారు. గతంలో మునిసిపల్ లో అజిత్ రెడ్డి సీఎంఓ లో ఉండగా ఇలాగె రోజుల తరబడి ఫైళ్లు పెండింగ్ లో ఉండేవి దానిలో భాగంగా ఆయనను బదిలీ చేసారు. ఇప్పుడు కూడా మునిసిపల్ ముఖ్య కార్యదర్శి , జీహెచ్ ఎంసీ కమిషనర్ , హెచ్ఎండిఏ కమిషనర్లను బదిలీ చేయాలనీ అంటున్నారు.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు