సెక్రెటరియేట్ లో ఓ అసిస్టెంట్ సెక్రెటరీ దందా
ఫైళ్లు కదలకంటే ముడుపులు అందాల్సిందే
సెక్రెటరియేట్ లో ఓ అసిస్టెంట్ సెక్రెటరీ దందా
రోజు రోజు అద్వాన్నంగా మారుతున్న పంచాయితీ రాజ్ శాఖ తీరు
సంబంధిత శాఖ అమాత్యుల సమన్వయం లేకపోవడమే కారణం అంటున్న ఉద్యోగులు.
ప్రమోషన్లు , పదోన్నతులకు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్న అధికారి
తెలంగాణ ప్రభుత్వ అధికారుల్లో భిన్న ధ్రువాలు బయట పడుతున్నాయి. ముఖ్య మంత్రి మంచితనం కొంతమంది ఉద్యోగుల పాలిట కాసుల వర్షం కురిపిస్తుంది.అవకాశం వచ్చిందే తడువు ఇక తమకు ఎదురు లేదన్నట్లు రెచ్చిపోతున్నారు. ప్రమోషన్లు , పదోన్నతులకు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారుతున్నారు.అడిగినంత ఇవ్వకపోతే ఎక్కడ తమ ప్రమోషన్లకు, పదోన్నతులు ఆగిపోతాయోనన్న భయంలో ముడుపులు ఇచ్చుకుంటున్నారు. తాజాగా పంచాయితీ రాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రెటరి హోదాలో పని చేస్తున్న ఓ అధికారి తీరు అందరిని విస్మయానికి గురి చేస్తుంది. గతంలో హైయర్ ఎడ్యుకేషన్ లో ఇదే తంతు కొనాగిస్తే జీఏడీకి బదిలీ చేసారు.తరువాత పంచాయితీ శాఖకు పెద్ద రిఫరెన్స్ తో రావడంతో ఎంపిడివోలు , జిల్లా పరిషత్ సీఈఓలు , డిప్యూటీ సిఇఓలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అధికారులు ఆయా పనుల నిమిత్తం వస్తుంటారు.వీరందరి ఫైళ్లు కదలంటే తన శాఖలోనే కొంతమందిని నియమించుకొని సాయంత్రం ఐదు గంటల తరువాత నేరుగా సచివాలయంలోనే సెటిల్మెంట్ చేస్తున్నారట.డిసెంబర్ వరకు పదవీకాలం ఉన్నందున అప్పటి వరకు తనను ఎవరు ఎం చేయలేరని హుకుం జారీ చేస్తున్నారట.ఎంపీడిఓ నుండి డిప్యూటీ సీఈఓకు పదోన్నతి పొందే ఓ అధికారి విషయంలో పూర్తిగా రూల్స్ కు వ్యతిరేకంగా చేస్తున్నారట.బదిలీలపై నిర్ణయం తీసుకొనే అంశంలో ఏఎస్ఓ లు , ఎస్ఓ లు తన పరిధిలోనే ఉండాలని ఆదేశాలు ఇస్తూ అందరిని భయ భ్రాంతులకు గురి చేస్తున్నారట.తనకు అనుకులంగా నోటింగ్ మార్చాలని ఎస్ఓ ,ఎఎస్ఓ లను బెదిరిస్తున్నారట. ఒకవేళ ఆ నోటింగ్ తనకు అనుకూలంగా లేకపోతె ఉన్న నోట్ ఫైల్ ను పక్కన పెట్టి సొంతగా తయారు చేసిన నోట్ ను నేరుగా సెక్రెటరీకి ఫైళ్లు పంపుతున్నారట.డబ్బులు ముడితే సీఎం స్థాయి లేదా మినిస్టర్ స్థాయిలో కావాల్సిన వాటిని తానె క్లియర్ చేస్తున్నారట. ఒకవేళ డబ్బులు రాకపోతే సెక్రెటరీ స్థాయిలో క్లియర్ కావాల్సిన వాటిని కావాలని సీఎంకు , మినిస్టర్ కు రాస్తున్నారట.ఇప్పటికైనా శాఖ ఉన్నతాధికారులు , మంత్రి ఇలాంటి వాటిపైన ద్రుష్టి పెట్టాలని కోరుతున్నారు.
Comments
Post a Comment