బదిలీపై వెళ్లిన ఇంకా శాఖ అధికారులపై పెత్తనం
శాఖలు మరీనా వివాదాస్పదంగా కొందరు ఐఏఎస్ ల తీరు
తాజాగా భారీగా ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సీనియర్ ఐఏఎస్ లకు పదోన్నతులు
ఆర్ అండ్ బి సెక్రెటరీగా చేసి హైదరాబాద్ కలెక్టర్ గా వెళ్లిన హరిచందన వ్యవహార శైలిపై శాఖలో చర్చ
బదిలీపై వెళ్లిన ఇంకా శాఖలోని అధికారుల పై పెత్తనం
ప్రభుత్వం పాలనా పరమైన నిర్ణయాల్లో ఎంత నిజాయితీగా ఉన్న కొంతమంది ఆఫీసర్ల తీరు మాత్రం మారడం లేదు. ఓ వైపు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇంకోవైపు సంబంధిత శాఖల మంత్రులు పకడ్బందీ గా పని చేస్తున్న ఉన్నతాధికారులు మాత్రం విచ్చల విడిగా వ్యహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. లేటెస్ట్ గా మొన్నటి వరకు రోడ్డు భవనాలు శాఖలో సెక్రెటరీ గా ఉన్న ఐఏఎస్ అధికారి హరి చందన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఈ ల ఫైళ్లు ఆపడం , రెగ్యులర్ ప్రమోషన్లు రాకుండా అడ్డుకోవడం లాంటి వాటివల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారట.న్యాక్ ఫైళ్లను ప్రస్తుతం డిపార్టుమెంట్ లో లేకున్నా హైదరాబాద్ కలెక్టరేట్ తీసుకెళ్లి సంతకాలు పెడుతున్నారట.డిపార్ట్మెంట్ లోని ఓ ఈ ఈ ఇచ్చిన సమాచారంతో విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ప్రినిసిపాల్ సెక్రెటరి వికాస్ రాజ్ వెంటనే వీటిపై ద్రుష్టి పెట్టాలని అంటున్నారు. సదరు అధికారి తీరుపై కింది స్థాయి ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారట. శాఖ నుండి బదిలీ అయి వెళ్లిన ఇంకా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వాహనాలను వాడుతున్నారట.అదే శాఖలో మంత్రి ఓఎస్డి అండదంలతో కింద స్థాయి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎర్ర మంజిల్ లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వానికి సంబంధిచిన ఆర్ అండ్ బి వాహనాలను ఇంకా తన వద్దే ఉంచుకోవడం వివాదాస్పదమౌవుతుంది.ఆ శాఖలో గడిచిన ఏడాది అనేక గొడవలు , ఇబ్బందులు రావడం తో కొందరు ఇంజనీర్లు అవమానంగా ఫీల్ అయ్యి వెళ్లి పోయినట్లు సమాచారం. ఉద్యోగులకు ప్రమోషన్లు , పదోన్నతులు రావాలంటే తన బిక్ష ఉండాల్సిందేనని అల్టిమేటం ఇస్తున్నారట.మంత్రి మంచితనాన్ని అడ్డుపెట్టుకొని ఓఎస్డి , ఐఏఎస్ అధికారి శాఖలో పెత్తనం చేయడం ఏంటని అంటున్నారు ఉద్యోగులు.
Comments
Post a Comment