ఆ అధికారి మాకొద్దు బాబోయ్

ఆ అధికారి మాకొద్దు బాబోయ్ 

ఉద్యోగుల ఆవేదన 

అక్కడ పనిచేసినందుకు ససేమీరా 

లివ్ లో వెళ్లేందుకు స్టాప్ ప్రయత్నం 

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల పనితీరుపై జరిగినంత చర్చ మరే ఇతర అంశాలపై జరగడం లేదు.ముఖ్యంగా వివిధ డిపార్ట్మెంట్లకు ఉన్నతాధికారులుగా ఏళ్ల తరబడి పని చేసిన వారి వ్యవహార శైలీపై కింది స్థాయి ఉద్యోగులు భయపడుతున్నారు.వారితో సరిగా ఉండకపోవడం, దురుసుగా ప్రవర్తించడం లాంటి వాటిపట్ల సంబంధిత శాఖల్లో పనిచేసేందుకు సుముఖుత చూపడం లేదట.సింగరేణిలో ఏడేళ్లు చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి రీసెంట్ గా పంచాయితీ రాజ్ కు బదిలీ అయ్యారు.సింగరేణి కాలరీస్లో ఉన్నప్పుడు ఆయా నియోజకవర్గాల వారీగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఏదైనా వినతి పత్రం ఇవ్వడానికి వెళితే కనీసం అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదట. అదే అంశాన్ని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు శాసన సభ వేదికగా ప్రభుత్వం ముందు ఉంచారు.గతంలో సోషల్ వెల్ఫేర్ శాఖలో ఉన్నప్పుడు తోటి ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండటం , అస్సలు శాఖను పట్టించుకోకపోవడంతో సీఎం నోటిస్కు తీసుకెళ్లారు పలువురు రూలింగ్ పార్టీ నేతలు.ఏడాది కాలం పాటు సోషల్ వెల్ఫేర్ ఉంటె అందులో ఓ అసిస్టెంట్ సెక్రెటరీ స్థాయి అధికారి లివ్ లో వెళ్లడం అప్పట్లో తీవ్ర దుమారం లేపింది. ఇటు ఫైళ్లను సైతం సరిగా చూడకపోవడంతో స్టాప్ అంత బాహాటంగానే పిర్యాదు చేసారు. వారంలో ఒకరోజు మాత్రమే ఫైళ్లను చూడటంతో ఆ  శాఖ అటకెక్కింది.అత్యంత ముఖ్యమైన సోషల్ వెల్ఫెర్ లో సదరు ఆఫీసర్ తీరుతో ఇబ్బందులు ఎదురుకొంది.తాజగా పంచాయితీ రాజ్ శాఖకు బదిలీపై రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందట.గతంలో ఉన్న తీరు మారకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురు అవుతాయని అంటున్నారు పిఆర్ ఉద్యోగులు.ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటపుడు ఎవరు ఏ శాఖకు సమర్థులు అని విచారణ చేసి అధికారులను కేటాయిస్తే డిపార్ట్మెంట్ లో అనుకున్న ఫలితాలు వస్తాయంటున్నారు. పంచాయితీ రాజ్ శాఖ ఎంపిడివో లు, ఇంజనీర్లు , జిల్లా పరిషత్ సీఈఓలతో మమేకమై ఉంటుంది.గతంలో ప్రినిపాల్ సెక్రటరీలు శాఖ పరమైన నిర్ణయాల్లో అందరిని కలుపుకొని వెళ్లేవారు.లోకేష్ కుమార్ ఇదే తరహా పద్దతి అవలంబించడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి.ఇంజనీర్లు, జనం ప్రినిసిపాల్ సెక్రటరీని నిత్యం కలిసేందుకు వస్తుంటారు.ఇక్కడ కూడా ఇలాగె ఉంటె శాఖ కుంటుపడి పోతుందని అంటున్నారు పంచాయితీ రాజ్ ఉద్యోగులు.మంత్రి ,జిల్లాల్లో పనిచేసే ఇంజనిర్లు అధికారి తీరుపై ఆందోళనలో ఉన్నారు.

 

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు