సర్వీస్ లో ఆ ఐఏఎస్ టాప్


సర్వీస్ లో ఆ ఐఏఎస్ టాప్ 

1995 లో ఐఏఎస్ గా పోస్టింగ్ 

దళిత ఆఫీసర్ కావడం తో దక్కని ప్రాధాన్యత.

కాంగ్రెస్ లో కొంతకాలం ప్రాధాన్యత గల పోస్టింగ్ వచ్చిన పక్కన పెట్టిన సర్కార్

ఐఏఎస్ ( ఇండియన్ అడ్మినిస్టేటివ్ సర్విస్ ) అంటే మాములు విషయం కాదు. రాజకీయ నాయకులు కొద్దీ కాలమే ఉంటారు. కాలం కలిసి వస్తే కొంతమంది సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నత పదవులను అధిరోహిస్తారు.ఆఫీసర్లు కూడా అంతే.దాదాపు నలబై ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ సర్వీస్ మొత్తం లో ఎంతవరకు ఉన్నత శాఖల్లో ఉన్నామన్నదే ప్రామాణికం అలాంటి కోవలోకె వస్తారు సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్.1995లో ఐఏఎస్ అయినా దాన కిశోర్ ఏలూరు జిల్లా నర్సాపూర్ సబ్ కలెక్టర్ గా మొదటి పోస్టింగ్ లో చేరారు.మొదటి పోస్టింగ్ లోనే అద్భుతమైన ఫలితాలు రాబట్టారు.తరువాత కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ పని చేసి 1997  మహబూబ్ నగర్ అచ్చంపేట లో ఎలక్షన్ డ్యూటీ ని సక్రమంగా నిర్వర్తించారు.2001 - 2002 లో కరీంనగర్ జాయింట్ కలెక్టర్ గా అభివృద్ధి అంటే ఏంటో చూపించి అప్పటి  కలెక్టర్ సుమిత్ర దవారా , ఆ జిల్లా ప్రజల ప్రశంశలు అందుకున్నారు.2005 - 06 లో కర్నూల్ కలెక్టర్ గా సూపర్ సక్సెస్ అయ్యి  2010- 11 లో ఉమ్మడి ఏపీలో పొల్యూషన్ బోర్డు ఎండిగా బాధ్యతలు చేపట్టారు. 2014 లో హోసింగ్ సెక్రెటరి గా అద్భుతమైన ఫలితాలు సాధించారు.తరువాత వాటర్ బోర్డు ఎండీగా దాదాపు ఏడేళ్లు బాధ్యతలు చేపట్టి పెద్ద పెద్ద రిజర్వాయర్లకు రూపకల్పన చేసారు.ఒక్కో రిజర్వాయర్ లో ఒక్కసారి వాటర్ నింపితే రెండు నెలల పాటు నీటి నిల్వా ఉండేలా చర్యలు చేపట్టారు.గ్రేటర్ లో బస్తీలకు ముంబై తరహా లో చిన్న వాటర్ ట్యాంక్ ల ఏర్పాటు చేసింది దాన కిశోరె.జీహెచ్ ఎంసీ అదనపు కమిషనర్ గా అదనపు బాధ్యతలు కేవలం ఏడాదిన్నరలోనే హైదరాబాద్ లో అద్భుతమైన శానిటేషన్ తీసుకొచ్చారు.గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ప్రశంశలు పొంది అక్కడ నుండి రంగారెడ్డి కలెక్టర్ గా మూడేళ్ల పాటు సేవలు అందించారు. రెవెన్యూలో భారీగా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేసి రైతుల సమస్యల పరిస్కారం కోసం కృషి చేసారు.ఆ తరువాత ఖమ్మం కలెక్టర్ గా కొద్దీ రోజులు మాత్రమే చేసిన భారీగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసారు.మైనార్టీ శాఖ  సెక్రెటరిగా మూడేళ్లు బాధ్యతలు చేసాక  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎం ఎ యుడి ప్రినిసిపాల్ సెక్రెటరీగా ఏడాదిన్నర కాలం బాధ్యతలు చేపట్టారు.మూసీ రిజర్వాయర్ పై జపాన్ టూర్ తో కొత్త ప్రణాళిక తీసుకొచ్చి  ఏడాదిలోనే మునిసిపల్ శాఖ ను పరుగులు పెట్టించిన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.అదే సమయం లో గవర్నర్ సెక్రెటరి గా ఆడిషన్ బాధ్యతలు తీసుకున్నారు.వాటర్ బోర్డు , జీహెచ్ ఎంసీ , సీడీఎంఎ లాంటి కీలక డిపార్ట్మెంట్ లలో పని చేసిన అనుభవంతో ఎంఎయుడిలో మంచి రిజల్ట్స్ తీసుకురాగలిగారు.లేటెస్ట్ గా కార్మిక శాఖ ప్రినిసిపాల్ సెక్రెటరీ గా ఛార్జి తీసుకోని డెయిలీ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ తరగతులతో  మాసాబ్ ట్యాంక్ , సనత్ నగర్,మల్లె పల్లి లో శిక్షణ లు ఇస్తున్నారు.ఈఏస్ఐ లో  మెరుగైన ట్రీట్మెంట్ కోసం ప్రణాళికలు అవలంబిస్తున్నారు.ఇలాంటి అనుభవం ఉన్న తెలుగు అధికారులను అప్పుడు టీఆరెస్,ఇప్పుడు కాంగ్రెస్ లు అపప్రధాన్యత గల పోస్టుల్లో ఉంచుతున్నారు.గులాబీ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు బీహార్ వాళ్లకు , కాంగ్రెస్ వచ్చాక తమిళ నాడు వాళ్లకు పెద్దపీట వేస్తున్నారు. దాన కిశోర్ లాంటి సీనియర్ తెలుగు ఐఏఎస్ లకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తే బాగుటుంది అంటున్నారు మేధావులు.దాన కిశోర్ మునిసిపల్ శాఖ నుండి బదిలీ అయ్యక డిపార్ట్మెంట్ ఆగం అవుతుంది అంటున్నారు ఎంప్లాయిస్.

 

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు