ఆ ఆఫీసర్ల తీరుపై వివాదం


ఆ ఆఫీసర్ల తీరుపై వివాదం 

సీఎం చెప్పిన మారని తీరు 

శాఖల్లో ఇష్టారాజ్యంగా వ్యవహారం 

ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటున్న సచివాలయ సిబ్బంది 


ప్రభుత్వంలో అధికారుల తీరుపై సీఎం సీరియస్ గా ఉన్నారట.ఎన్నిసార్లు చెప్పిన తీరు మారకపోవడంతో  ఇక ఉపేక్షించేది లేదంటున్నారు సీఎం. పలువురు సీనియర్ అధికారులు వారి శాఖల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని సమాచారం.ఎంఎయుడి ప్రిన్సిపాల్ సెక్రెటరి ఇలంబర్తి రెగ్యులర్ గా ఒక్క ఫైల్ చూడటం లేదని వినికిడి. మునిసిపల్ అడ్మినిస్టేషన్ స్టాప్ అంత అధికారి వైఖరితో బెంబేలెత్తుతున్నారనని జోరుగా ప్రచారం సాగుతోంది.ఎక్కడికి వెళ్లిన పది నెలల కంటే ఎక్కువగా ఉండటం లేదు. మాములుగా ఎవరైనా ఆఫీసర్ బదిలీపై వెళితే కనీసం మూడు నాలుగు ఏళ్ళు ఉంటారు కానీ ఈయన కేవలం నెలలకె పరిమితం అవుతున్నారు.ఛార్జి తీసుకున్నప్పటి నుండి దాదాపు ఎనభై ఫైళ్లు పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. విజిటర్స్ సమయంలో కూడా ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో బాధితులు వెనక్కు వెళ్తున్నారని తెలుస్తుంది.గతంలో దాన కిశోర్ , అరవింద్ కుమార్  ఉన్న సమయంలో అందరికి రెగ్యులర్ యాక్సెస్ ఉండేది.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో స్పీకర్ తన సొంత నియోజకవర్గ పనిమీద ఫోన్ చేస్తే ఆన్సర్ చేయకుండా ఉన్నారట.కొత్తగా వచ్చిన శ్రీదేవి మున్సిపల్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు.మరో ఇద్దరు సీనియర్ అధికారులు మాణిక్ రాజ్, కర్ణన్ ల పనితీరు కూడా ఇలాగే ఉందన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యమైన శాఖలన్ని ఈ ఇద్దరి దగ్గరనే ఉన్నాయి. ఎమ్మెల్యేల కు కూడా మాణిక్ రాజ్ సమయం ఇవ్వడం లేదట.గతంలో పనిచేసిన చంద్ర శేఖర్ రెడ్డి అందరికి సమయం ఇచ్చేవారు.జీహెచ్ ఎంసీ కమిషనర్ తీరుపై సర్వత్రా విమర్శలు ఉన్నాయి.బల్దియా ఉద్యోగులు కమిషనర్ తీరుపై జోరుగా చర్చించుకున్నరట. ముగ్గురు తమిళనాడు కు చెందిన ఆఫీసర్లు ప్రభుత్వంలో కీలక శాఖల్లో ఉంటూ పబ్లిక్ కోసం పనిచేయకుండా ఉండటం పై సీఎం నోటీసులొకి తీసుకెళితే బాగుటుంది అంటున్నారు.

 

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు