ఫైనాన్స్ సెక్రటరీ పనితీరు భేష్



ఫైనాన్స్ సెక్రటరీ పనితీరు భేష్  

           కొత్త బాస్ పని తిరుపై ఉద్యోగుల సంతృప్తి 

                                                     గతం కంటే పర్వాలేదంటున్న ఎంప్లాయిస్. 

                                                    వెంట వెంటనే బిల్లులకు మోక్షం


తెలంగాణ ప్రభుత్వ యంత్రంగం లో ఆఫీసర్ల పనితీరుపై ఫీడ్ బ్యాక్ బాగుంటుంది. భారీగా అధికారుల బదిలీల తరువాత డిపార్టుమెంట్ల వారీగా అనుకున్న స్థాయిలో పలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక శాఖలో బదిలీల తరువాత చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం లో ఏళ్ల తరబడి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి మొన్నటి వరకు అత్యంత దారుణంగా ఉండేది. కానీ ప్రస్తుతం కొత్త అధికారిగా సందీప్ కుమార్ సుల్తానియా వచ్చిన తరువాత ఉద్యోగులు , పెన్షనర్లు,కాంట్రాక్టర్లకు సమస్యలు వెంట వెంటనే క్లియర్ అవుతున్నాయట.ఏళ్ల తరబడి వేచిచూసిన వాళ్లకు తక్షణమే మోక్షం లభిస్తుండటంతో శాఖ పరమైన నిర్ణయాలు బాగుంటున్నాయని అధికార పార్టీ నేతలే చెప్పడం చెప్పుకోదగ్గ పరిణామం. రామ కృష్ణ రావు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నన్ని రోజులు మాములు సామాన్యులకు కాదు కదా లీడర్లకు కూడా అందుబాటులో ఉండేవారు కాదన్నా పేరుంది. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక సందిగ్ధం లో వెళ్లిపోయేవారు.పదేళ్లలో ఆర్థిక శాఖలో టోకెన్లకు కమిషన్ల పర్వం అప్పటి నుండే మొదలైంది.ఈటెల రాజేందర్ , హరీష్ రావు లాంటి వాళ్ళు ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు.ప్రభుత్వం లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు గాని ప్రజలకు ఉపయోగ పడే అంశాల్లో నేరుగా ఆఫీసర్లకు మంత్రులు డైరెక్షన్ చేసేవాళ్ళు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా పాత అధికారీనె ఎక్కువ రోజులు కంటిన్యూ చేయడంతో పన్నెండు శాతం,పది శాతం,తొమ్మిది శాతం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఈ దెబ్బతో కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది. సీఎం సొంత జిల్లాల్లో కొన్ని అభివృద్ధి పనులకు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు సముఖత చూపలేదని ఓ బడా కాంట్రాక్టర్ చెప్పడం శోచనీయం.ఆర్థిక శాఖ మంత్రి నుండి సమయానికి అనుమతులు రాకపోవడం తో పాటు బిల్లులు క్లియర్ చేసే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదని చెప్పినట్లు సమాచారం.ముఖ్య మంత్రి మీద గౌరవంతో  టెండర్లలో పార్టీసిపెట్ చేస్తే బిల్లుల విషయంలో శాఖ మంత్రి త్వరితగతిన అనుమతులు ఇవ్వరు కాబట్టి దానికి దూరంగా ఉంటె బెటర్ అన్న ఆలోచనలో ఉన్నరట. అయితే అధికారులు మాత్రం పని చేసేందుకు సంసిద్ధంగా ఉన్న పైనుండి ఆదేశాలు వెంట వెంటనే వస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయన్న ప్రచారం నడుస్తోంది.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

ఆ బ్రాండెడ్ దుస్తులే కావాలట.