పంచాయితీ రాజ్ శాఖపై సీఎం ద్రుష్టి.


 జులై మొదటి వారంలో స్థానిక సమరం.

పెండింగ్ లో భారీగా బకాయిలు. 

తెలంగాణ పంచాయితీ రాజ్ లో తప్పని తిప్పలు.

 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్లియర్ అవుతున్న బిల్లులు.

టీఆరెస్ పిరియడ్ లో కాంట్రాక్టుల అవస్థలు.

 త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి షెడ్యూల్ రానుంది.ఈ నేపత్యంలో గ్రామీణాభివృద్ధి పంచాయితీ రాజ్ శాఖలో పేరుకుపోయిన బిల్లులపై జోరుగా చర్చ జరుగుతోంది.పదేళ్ల టీఆరెస్  పిరియడ్ లో దాదాపు పన్నెండు వందల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.అప్పుడప్పుడు  సర్పంచ్ ల ఆందోళన , కాంట్రాక్టర్ల నిరసనలతో కెసిఆర్ గవర్నమెంట్ కొద్దో గొప్పో పెండింగ్ బిల్లులు ఇచ్చింది. కాంగ్రెస్ కొలువుదీరినాక రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక పంచాయితీ రాజ్ శాఖపై పూర్తీ స్థాయి ద్రుష్టి సారించారు.దీనికి తోడు సెక్రెటరీ,ఈఎన్సీల పనితీరు బాగుండటంతో లోకల్ ఫైట్ లో మెరుగైన ఫలితాలు సాదించాలనే పట్టుతో ఉన్నారు సీఎం. పెండింగ్ నిధులే ప్రధాన సమస్యగా మారకుండా ముందు జాగ్రత్తతో ఎదురుకొనేందుకు సరైన ప్రణాలికలు రచించేలా పంచాయితీ రాజ్ ఉన్నతాధికారుల సీఎం అదేచించారట.పంచాయితీ లో పనితీరు పై సీఎం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. గడిచిన సారి పార్లమెంట్ టీం విసిట్ చేసి పిఆర్ పనితీరు పై ప్రసంశలు కురిపించారు.తెలంగాణ పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ పై ప్రశంసల జల్లు కురిపించారు.ఈ  క్రమంలో 550 కోట్లకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి వస్తే గ్రామాల అభివృద్ధి మరింత పెరుగుతుందని సూచించిందట.ముఖ్య మంత్రికి పంచాయితీ రాజ్ మీద అపారమైన పట్టు ఉండటం తో ఎలాగైనా శాఖను మరింత మెరుగు పరచాలని భావిస్తున్నారట. ఇంకా కొన్ని చోట్ల టెండర్లకు అనుమతులు రాకపోవడం తో వెంటనే పిలవాలని సీఎం అదేచించారు.పెండింగ్ పనులపై పురోగతి తో పాటు తక్షణమే నిధులు విడుదల చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయని ముఖ్య మంత్రి యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.సర్పంచ్ లు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎం నిర్ణయంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రతి వారం జిల్లాల వారీగా ఈఎన్సీ రివ్యూలు నిర్వహిస్తున్నారు. రోడ్ల క్వాలిటీ పెంచడంతో పాటు డిపార్ట్మెంట్ ను బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగుల సమస్యలు అన్ని క్లియర్ చేస్తున్నారు.ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ,ఎంపీల మీద  పెరుగుతున్న ఒత్తిడితో గ్రామాల్లో తిరగడం లేదట.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

ఆ బ్రాండెడ్ దుస్తులే కావాలట.