తెలంగాణ సచివాలయంలో కొత్త సంప్రదాయం.

 

తెలంగాణ సచివాలయంలో కొత్త సంప్రదాయం.

బదిలపై వెళ్తున్న ఐఏఎస్ లందరు పాత స్టాప్ ను వెంట పెట్టుకొని వెళ్తున్న వైనం.

శాఖ నుండి శాఖకు మారిన అదే తంతు. 

అధికారుల కోటరీగా పలువురు పీఎస్ లు , ఓఎస్డీలన్న ప్రచారం.

ఐఏఎస్ లు ఏ శాఖల్లో ఉన్న వీళ్లదే హవా. 

- తెలంగాణ సెక్రటరియట్ లో కొత్త సాంప్రదాయం తెరమీదకు వచ్చింది.ఇప్పటి వరకు పొలిటికల్ లీడర్లకే పరిమితం అయిన ఈ సాంప్రదాయం ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పాకింది. సాధారణంగా ఐఏఎస్ అధికారులు శాఖలు మారడం సర్వసాధారణం.ప్రతీ రెండేళ్లకు ఒకసారి శాఖ మార్పు ఖచ్చితంగా ఉంటుంది.గత పాలనలో ఒకే శాఖలో అధికారులు ఏళ్ల తరబడి పనిచేశారు.ఆయా శాఖలకు ప్రినిసిపాల్ సెక్రెటరిలు ,సెక్రటరీలుగా పని చేసిన ఐఏఎస్ ల దగ్గర ఉన్న ఓఎస్డీ లు ,పీఎస్ లు తమ ఆఫీసర్లు ఎక్కడకు బదిలీపై వెళితే వారు కూడా అక్కడకే వెళ్తున్నారట. దింతో పలువురు సీనియర్ల దగ్గర పనిచేసే అవకాశం తమకు రావడం లేదని మిగతా ఉద్యోగులు మదన పడుతున్నట్లు చర్చ జరుగుతుంది.దింతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులపై ప్రభుత్వ పెద్దలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వ రహస్యాలను గత ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారని ఆరోపణలు చేశారు.దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం ప్రతి విషయంలో గోప్యత పాటించడం మొదలు పెట్టారు. ప్రభుత్వం శాఖల వారీగా బదిలీ చేసిన ప్రతిసారి తమతో పాటు తనకు నమ్మకంగా పనిచేసిన సపోర్టింగ్ స్టాఫ్ ను తీసుకెళ్ళాల్సి వస్తుందని అధికారులు కొట్టి పారేస్తున్నారు. దానిలో బాగంగా అప్పటికే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బదిలపై లేదా డిప్యూటేషన్లపై తోడు తెచ్చు కుంటున్నారట. సాధారణంగా పొలిటికల్ లీడర్లు మాత్రమే కొనసాగించిన ఈ ఫార్ములా ఇప్పుడు అధికారులు ఫాలో కావడంతో ప్రచారం జోరందుకుంది.ఈ మధ్య కాలంలో జరిగిన బదిలీల్లో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్యూరిటీ గా సందీప్ కుమార్ సుల్తానియా, హెచ్ఎండీఏ సెక్రెటరీగా ఇలంబర్తి, మొన్నటి వరకు టూరిజం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ శాంతి కుమారి, జయేష్ రంజన్, రాహుల్ బొజ్జ, డీఎస్ చౌహాన్ లాంటి అధికారులు ఎక్కడికి వెళ్లినా వాళ్లకు సంబంధించిన, నమ్మకంగా ఉన్న వారిని మాత్రమే ఓఎస్డీ స్థాయి నుంచి అటెండర్ వరకు వెంట తెచ్చుకుంటున్నారని వినికిడి.అయితే ఇలా నమ్మకంగా ఉండే వాళ్లను తెచ్చుకోవడం వెనుక తమ శాఖల్లో జరిగే ముఖ్యమైన విషయాలు బయటకు వెళ్లకుండా ఉంటాయన్నా  ఆలోచనట.దీంతో పాటు వ్యక్తిగత విషయాలు సైతం బయట వ్యక్తులకు తెలియకుండా ఉండటానికి ఉపయోగ పడుతున్నారని తెలుస్తోంది.అందుకే ఎక్కడికి వెళ్లినా వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఓ టీం ఉండాలని,నమ్మకమైన వ్యక్తులే ఉండాలని పట్టుబడి మరి తోడు తీసుకెళ్తున్నారట! అయితే అప్పటికే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది కాస్త ఇబ్బందిగా మారుతుందని సెక్రటేరియట్ ఉద్యోగుల్లో జోరుగా  చర్చ జరుగుతుంది.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

ఆ బ్రాండెడ్ దుస్తులే కావాలట.