Posts

Showing posts from February, 2025

సీఎస్ వైఖరి పై చర్చ

Image
తెలంగాణ సీఎస్ వైఖరి పై విమర్శలు  సీఎస్ వ్యవహార శైలిపై ఐఏఎస్ ల గుస్సా  అధికార పార్టీ నేతలకు దొరకని చీప్ సెక్రెటరి అపాయింట్మెంట్ పెండింగ్ లో పలు ఫైళ్ళు  డిస్కషన్ పేరిట కాలయాపన అంటూ ఉద్యోగుల ఆవేదన తెలంగా చీప్ సెక్రెటరీపై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.టీఆరెస్ పిరియడ్ లో అపాయింట్ అయిన సీఎస్ ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బదిలీ చేస్తారన్న ప్రచారం సాగింది.అయితే ఉన్న సీనియర్  అధికారుల్లో శాంతి కుమారి సీనియర్ కావడంతో అలాగే కొనసాగిస్తున్నారు.ఏడాది పిరియడ్ లో ప్రభుత్వానికి బాగానే సహకారం అందిస్తు వస్తున్న ఈ మధ్య కాలంలో సీఎస్ వ్యవహార శైలిపై రక రకాల ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు , ప్రభుత్వం లో మిత్ర పక్షంగా ఉన్న వాళ్లకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట.ఇక సచివాలయంలో పని చేస్తున్న పలువురు సీనియర్ ఐఏఎస్ లకు కూడా సమయం ఇవ్వడం లేదన్న చర్చ నడుస్తోంది బిఆర్ అంబెడ్కర్ సచివాలయం వర్గాల్లో.అప్పట్లో సోమేశ్ కుమార్ సీఎస్ గా ఉండగా తనకంటూ సొంత కోటరీ ఏర్పాటు చేసి మిగతా ఐఏఎస్ లను ఇబ్బందులకు గురి చేసేవారన్న పేరుంది. ఇప్పుడు అదే బాటలో ప్రస్తుత సీఎస్ నడుస్తున్నారట.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్...

ఆ బ్రాండెడ్ దుస్తులే కావాలట.

 ఆ బ్రాండెడ్ దుస్తులే కావాలట  ఎంపీలు , ఎమ్మెల్యేలకు రిపోర్టర్ సిఫార్స్. విలేఖరి వైఖరితో అవాక్కవుతున్న పార్టీ నేతలు. ఈ మధ్య కాలంలో జర్నలిజంలోకి రావడం కొంతమందికి ఫ్యాషన్ అయిపొయింది.వృత్తి రీత్యా ఒకప్పుడు ఉన్న నిబద్దత ఎక్కడ కనిపించడం లేదు.విలేఖరీ అంటే ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వలను అలెర్ట్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రెగ్యులర్ గా ఆయా డిపార్ట్మెంట్ లతో పాటు పొలిటికల్ పార్టీ బీట్ చూసే వాళ్ళ వ్యవహార శైలీ జుగుప్సా కారణంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.తాజాగా *కట్నం తీసుకొనే వాడు గాడిద* అంటూ ఉదర గొట్టే ఓ ప్రముఖ ఛానెల్ లో పనిచేసే రిపోర్టర్ తీరు అందరిని విస్మయానికి గురి చేస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు , ఎనిమిది మంది ఎంపీలు ఉన్న ఆ పార్టీకి సదరు రిపోర్టర్ గా పనిచేసే వ్యక్తి ఉత్తర తెలంగాణ నుండి ఎమ్మెల్యేగా గెలిచినా నేతతో పాటు దక్షిణ తెలంగాణ నుండి ఎంపీగా గెలిచిన సీనియర్ నేతను తనకు *రేర్ ర్యాబిట్* బ్రాండెడ్ దుస్తులను కొనివ్వలని వెంటపడుతున్నట్లు తెగ ప్రచారం నడుస్తోంది.గతంలో ఢిల్లీలో పనిచేసినప్పుడు లీడర్లు అందరు తమను ఫై...

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

Image
  రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ. స్టేట్ లో అత్యంత కీలకమైన పిఆర్ లో అమాత్యుల పనితీరుపై ఆరోణలు.  శాఖలో సమన్వయ లోపం , పెండింగ్ పనులతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు. రాష్ట్రంలో  అత్యంత కీలకమైన శాఖల్లో ఒకటైన  పంచాయితీ రాజ్ శాఖలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి తీరుపై ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ నడుస్తోందట. ప్రభుత్వంలో చాల మంది సీనియర్లు ఉండగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో అప్పగించిన ఆ శాఖలో పురోగతి లేకపోవడంతో పాటు మిగతా డిపార్టుమెంట్ల తో పోలిస్తే పూర్తిగా వెనకబడి పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.కాంట్రాక్టర్లకు సమయానికి బిల్లులు రాక నెలల తరబడి ఆర్ డబ్ల్యూ ఎస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని వాపోతున్నట్లు జోరుగా ప్రచారంసాగుతోంది.శాఖాపరమైన నిర్ణయాలతో పాటు విజిలెన్స్ కేసులకు సంబంధించిన ఫైళ్లు 400 పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.దీనిపై మంత్రి గారికి విన్నవించుకుందాం అనుకుంటే సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట బాధితులు.కేసులు,ప్రమోషన్లకు సంబంధించిన అంశాల్లో నేరుగానే శాఖ పెద్దలు తమకు ఎం లేదా అని సన్నిహితు...

tandel movie super hit

Image
 tandel movie super 

హెచ్ ఎండీ ఎ లో తప్పని తిప్పలు

హెచ్ఎండీఎలో తప్పని తిప్పలు. పైనుండి  ఆదేశాలు వస్తే తప్ప ముందుకు కదలని ఫైళ్లు*. బాధితులకు తప్పని ఇబ్బందులు. సీఎంఓ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే పరిస్థితి లేక సామాన్యుల ఇక్కట్లు.* హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పై సామాన్యులు గుర్రుగా ఉన్నారట.నెలల తరబడి తమ ఫైళ్లు పెండింగ్ లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారని స్వర్ణ భారతీ జయంతి కాంప్లెక్స్ లో చర్చించుకున్నారని వినికిడి. ఎకరం , రెండెకరాల నుండి మొదలు పది ఎకరాల వరకు అనుమతులు రాకపోవడంతో సదరు బెనిఫిర్స్ ఆందోళనలో ఉన్నారు.లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి అనుమతుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షనలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.ఫైళ్లు ఎందుకు ఆగుతున్నాయని అడగటంతో సదరు అధికారులు ఇచ్చే సమాధానంతో ఖంగు తింటున్నామని చెప్తున్నారు. పైనుండి ఆదేశాలు వస్తే ఫైళ్లు క్లియర్ చేసేది లేదని చెప్పడంతో ఎవరిని కాలవలో తెలియక అయోమయంలో ఉంటున్నారని అంటున్నారు.దీనివల్ల హెచ్ఎండీ ఎ కు చెడ్డ పేరు వస్తుందని ఫైర్ అవుతున్నారు.గతంలో అరవింద్ కుమార్ కమిషనర్ గా ఉన్న సమయంలో ఇదే పరిస్థితి ఎదురైంది.ఇప్పుడు అదే తంతు నడవడంతో  తమ గోడు ...