ఆర్ అండ్ బి శాఖలో మంత్రి కోమటి రెడ్డి టాప్

రోడ్ల మరమ్మతులకు 100 కోట్లు అవసరం హ్యామ్ కింద 4వేల కి.మీ రోడ్ల పునరుద్ధరణ ఆర్‌ఆర్‌ఆర్ బాధితులకు పరిహారం చెల్లించండి హ్యామ్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్లకే ప్రాధాన్యమివ్వాలని రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు.ఇటీవల హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కేంద్ర కార్యాలయంలో హ్యామ్‌పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న రోడ్లనే ఈ ప్రాజెక్టు కిందకు తీసుకోవాలని సూచించారు. హ్యామ్ కింద చేపట్టే రోడ్లు గ్రామీణ ప్రాంతాలకు అనుసంధాన కారిడార్లుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై వెనుకబడిన జిల్లాలకు హ్యామ్‌లో మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కొత్తగా భూ సేకరణ అవసరం లేదని, ప్రస్తుతమున్న రోడ్లనే ఒక వరుస నుంచి రెండు వరుసలుగా విస్తరిస్తామని చెప్పారు. దాదాపు 4 వేల కి.మీ రోడ్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల ...